రిషి ప్రాణాలు కాపాడటం కోసం జగతి ఏం చేయనుంది?
on May 25, 2023

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -771 లో.. రిషి గదిలోకి జగతి వస్తుంది. పడుకోని ఉన్న రిషిని చూస్తూ బాధపడుతుంది జగతి. అప్పుడే రిషికి మెలకువ వచ్చి ఉలిక్కిపడి జగతిని చూస్తాడు. మీరేంటి మేడం ఈ టైంలో.. ఇక్కడ అని అడుగుతాడు. ఆ తర్వాత జగతి దేని గురించో భయపడుతున్నట్లు అర్థం చేసుకుంటాడు రిషి.. మేడం నా గురించి మీరు ఏదైనా విషయం దాస్తున్నారా? అందుకే భయపడుతున్నారా అని రిషి అడుగుతాడు. జగతి మాత్రం ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. నాకేం కాదు మీరు నా పక్కన ఉన్నంతవరకు నాకేం కాదని రిషి అంటాడు. ఆ తర్వాత జగతి అక్కడ నుండి వెళ్ళిపోతుంది.
మరొకవైపు జగతి బాధపడడం చూసిన వసుధారల.. తన దగ్గరికి వచ్చి.. ఏమైంది ఎందుకు అలా ఉన్నారని అడుగుతుంది. ఏం లేదు వసు.. నాకు ఒక మాట ఇస్తావా అని జగతి అడుగుతుంది. ఏంటీ మేడం అని వసుధార అడగగానే.. నేను ఇప్పుడు ఏం చెప్పను.. చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు చెప్తానని జగతి అంటుంది. సరే మేడం అని జగతికి మాట ఇస్తుంది వసుధార. మరుసటి రోజు ఉదయం కాలేజీకి వెళ్ళడానికి అందరూ రెడీ అయి హాల్లోకి వస్తారు. రిషి DBST మెడికల్ కాలేజీ ఎండీ గా మొదటిసారి ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నావ్ కంగ్రాట్స్ అంటూ ఫణింద్ర అంటాడు.
రిషి దేవయాని బ్లెస్సింగ్స్ తీసుకుంటాడు. ఇక రిషి, వసుధారలు కాలేజీకి బయల్దేరుతుంటే.. నేను మీతో పాటు వస్తానని జగతి అంటుంది. ఆ తర్వాత జగతి, రిషి వసుధారలు కలిసి కాలేజీకి వెళ్తారు. జగతి వాళ్ళిద్దరితో కలిసి వెళ్లడం చూసిన శైలేంద్ర వెళ్ళు వెళ్ళు అని నవ్వుకుంటాడు. జగతి కాలేజీకి వెళ్తుంటే దార్లో కూడా ఏదో దిగులుగా ఉంటుంది. వసుధార జగతిని చూసి ఎందుకు ఇలా ఉన్నారని అడుగుతుంది. మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి.. ఇద్దరు ఒకరికొకరుగా ఉండాలని రిషి వసుధారలకి జగతి చెప్తుంది. ఏంటీ మేడం ఈ రోజు జాగ్రత్తలు చెప్తున్నారని రిషి అడుగుతాడు. చెప్పాలనిపించింది చెప్తున్నా అని జగతి అంటుంది.
కాలేజీకి వెళ్ళాక రిషి, వసుధారలు ఎవరి బిజీలో వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత వసుధార దగ్గరికి జగతికి వెళ్లి.. నిన్న నాకు ఒక మాట ఇచ్చావ్ కదా? కచ్చితంగా చేసి తీరాలి.. లేదంటే రిషిని ఆ శైలేంద్ర బ్రతకనివ్వడని జగతి ఏడుస్తుంది. రిషి సర్ కి ఏం కాదు మేడం అని వసుధార అంటుంది. ఆ తర్వాత రిషి మిషన్ ఎడ్యుకేషన్ ఫండ్స్ ని మెడికల్ కాలేజీకి ఉపయోగించుకుంటున్నాడని చెప్పాలని జగతి అంటుంది. అలా రిషి సర్ పై నింద వెయ్యడమా? నా వాళ్ళ కాదని వసుధార అంటుంది. ఎలాగైనా నువ్వు చెయ్యాలి.. రిషి క్షేమంగా ఉండడం కావాలని జగతి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



